Telugu Gateway
Politics

కెటిఆర్ ఇప్పుడు ఏమంటారో?!

కెటిఆర్ ఇప్పుడు ఏమంటారో?!
X

మాట్లాడితే బీజేపీ పై విరుచుకు పడుతున్న తెలంగాణ సర్కారు, బిఆర్ఎస్ కు ఇది షాక్ లాంటి పరిణామమే. అటు బీజేపీ అయినా...ఇటు బిఆర్ఎస్ అయినా ఎవరి చేతిలో ఉన్న వ్యవస్థలను వాళ్ళు తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా వాడుకుంటున్నారు. కానీ మంత్రి కెటిఆర్ మాత్రం తాము అంతా పారదర్శకంగా.. అంతా ఫెయిర్ గా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ల ఎర కేసు కు సంబదించిన విషయంలో తాజా గా హై కోర్టు వెలువరించిన తీర్పు తెలంగాణ సర్కారు ను ఇరకాటంలో పడేసింది. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ కేసు ఆధారాలను బయటపెట్టిన తీరును తప్పుపట్టింది. కేవలం సీఎం కెసిఆర్ నిర్ణయాలవల్లే ఇక్కడ ఇది నిష్పక్షపాతంగా విచారణ జరిగే అవకాశం లేదని హై కోర్టు తేల్చింది అంటే ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసు ను సిట్ నుంచి సిబిఐ కు బదిలీ చేస్తూ రాష్ట్ర హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిసూ కెసిఆర్ ఫార్మ్ హౌస్ ఫైల్స్ ప్లాప్ షో అని..హై కోర్టు తీర్పు సీఎం కెసిఆర్ కు చెంప దెబ్బ అంటూ విమర్శించారు. దీనికి మంత్రి కెటి ఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసు సీబీఐకి బదిలీ అయింది అనగానే ముసుగు దొంగలు అంతా బయటకు వస్తున్నారు అని...సిబిఐ ఎలాగూ తమ చేతిలో ఉంది కాబట్టి ఇష్టానుసారం వాడుకోవచ్చు అనే ధీమాతో ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కంటే బీజేపీ దారుణంగా సిబిఐ ని వాడుతుంది అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు సిబిఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటూ ఎద్దేవా చేశారు.

అంత వరకు బాగానే ఉంది. హై కోర్టు తీర్పు బయటకు వచ్చాక తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా మీడియా తో మాట్లాడి ఎలా ఉల్లంఘనలకు పాల్పడింది హై కోర్టు తీర్పులో ప్రస్తావించారు. బీజేపీ సిబిఐ ని వాడుకుంటే..తెలంగాణ ప్రభుత్వం, సీఎం కెసిఆర్ తన ఆదీనంలో పనిచేసే పోలీస్ అధికారులను, సిట్ ను వాడుకున్నట్లు ఈ తీర్పు స్పష్టం చేసింది. అసలు ఎలా చూసుకున్న కూడా ఈ కేసు లో కీలకమైన ఆధారాలు సీఎం చేతికి చేరటానికి ఆస్కారం లేదని..అయినా కూడా అవి కెసిఆర్ చేతికి వచ్చాయంటే సీఎం కెసిఆర్ వ్యవస్థను ఎలా వాడుకున్నది అర్ధం అవుతోంది. బీజేపీ, బిఆర్ఎస్ రాజకీయ పోరాటంలో నిందితులకు ఉన్న రాజ్యాంగ,, చట్టబద్దమైన హక్కుల విషయాన్నీ మర్చిపోయారని కోర్టు తేల్చి చెప్పింది. హై కోర్టు తీర్పు చూస్తే కేవలం సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్, ఛార్జీషీట్ దాఖలు చేయక ముందు కీలక ఆధారాలు అన్ని జడ్జిలు, మీడియా తో పాటు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం వల్లే సిట్ విచారణ నిష్పక్షపాతముగా సాగే అవకాశం లేదని కోర్టు ఒక అంచనాకు వచ్చింది. అందుకు సిట్ ను రద్దు చేసి సిబిఐ కి విచారణ బాధ్యత అప్పగించింది. ఈ తీర్పు ప్రతిని చూసిన న్యాయ నిపుణులు ప్రభుత్వం అప్పీల్ చేసుకున్నా ఊరట దక్కటం అనుమానమే అని అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు రాష్టంలో బిఆర్ఎస్ వ్యవస్థలను తన ఇష్టానుసారం వాడుకుంటూ ఇతరులపై మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ సర్కారు చేస్తున్న పనులే కేంద్రంలో బీజేపీ కూడా ఇంతకంటే ఎక్కువ చేస్తుందని చెపుతున్నారు. ఈ కేసు సిబిఐ చేతికి చేరిన తర్వాత ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయటికి వస్తాయో అన్న టెన్షన్ బిఆర్ఎస్ నేతల్లో ఉంది.


Next Story
Share it