Telugu Gateway
Politics

కెసీఆర్ కు దేవేగౌడ ఫోన్

కెసీఆర్ కు దేవేగౌడ ఫోన్
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ బిజెపికి వ్య‌తిరేకంగా గ‌ళం విన్పించ‌టాన్ని మాజీ ప్ర‌ధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ స్వాగ‌తించారు. ఈ అంశంపై ఆయన మంగ‌ళ‌వారం నాడు సీఎం కెసీఆర్ కు ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపారు. పెద్ద యుద్ధం ప్రారంభించార‌ని..దీనికి త‌మ వంతు అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. దేశంలోని లౌకిక శ‌క్తులు అన్నీ ఏకం అయి . దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేవెగౌడ స్పంద‌న‌పై కెసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశం అవుతానని దేవెగౌడ‌కు తెలిపారు.

Next Story
Share it