Telugu Gateway
Politics

హ‌రీష్ భార్య కూడా నేనే గెల‌వాల‌నుకుంట‌ది

హ‌రీష్ భార్య కూడా నేనే గెల‌వాల‌నుకుంట‌ది
X

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము ఇళ్ళ‌లో ఏడ్చిన‌ప్పుడు త‌డిచిన దిండ్ల‌ను చూసింది భార్య‌లే అని అన్నారు. హ‌రీష్ రావు ఇంట్లో ఉన్న ఆడ‌బిడ్డ కూడా తానే గెల‌వాల‌ని కోరుకుంట‌ది అని వ్యాఖ్యానించారు. ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి నాయ‌కుని భార్య కూడా ఫోన్ చేసి మ‌నం ఈటెల‌ను కాపాడుకోవాల‌ని చెప్పిందని తెలిపారు. తాను అంత చిన్నోడిని అయితే ఇన్ని వంద‌ల కోట్లు ఎందుకు ..ఎందుకు ఇంత హంగామా చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ ప్రజులు ఎన్నుకున్న 119 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ల‌పై నిఘా పెట్టార‌న్నారు. అంబేద్క‌ర్ రాజ్యాంగం ఉంది కాబ‌ట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు కానీ..లేక‌పోతే కెసీఆర్ వాడేందుకు..వీడెందుకు అని అంద‌రినీ తీసిప‌డేవార‌న్నారు. మూడున్న‌ర‌..నాలుగు కోట్ల మంది ప్ర‌జ‌లు ఎన్నుకున్న వారిని కూడా న‌మ్మని నీకు అస‌లు ప‌రిపాలించే అర్హ‌త ఉందా? అని కెసీఆర్ ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు.

ఈటెల బుధ‌వారం నాడు హుజూరాబాద్ లో నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు నిప్పుర‌వ్వ హూజురాబాద్ లోనే అంటుకుంద‌ని..ఇది త్వ‌ర‌లోనే తెలంగాణ అంత‌టా పాకుతుంద‌ని అన్నారు. ద‌స‌రా అయినా..బోనాలు అయినా పండ‌గ ఒక్క రోజే ఉంట‌దని..కానీ గ‌త కొన్ని రోజులుగా ఇక్క‌డ పండ‌గే ఉంద‌ని..ఇక్క‌డ తాగినోళ్ళ‌కు తాగినంత‌..తిన్నోళ్ల‌కు తిన్నంత‌లా ఖ‌ర్చు పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. తన ప‌క్క‌న ఉన్న ఓ వ్య‌క్తికి ద‌ళిత బంధు అర్హ‌త లేకుండా చేశార‌ని..మ‌రో వ్య‌క్తి ఇళ్ళు కూల‌గొడ‌తామ‌ని బెదిరిస్తున్నార‌న్నారు. అయినా స‌రే వాళ్ళు త‌న‌తోనే ఉంటున్నార‌ని..ఇది ర‌క్త‌సంబంధం కంటే గొప్ప‌ద‌న్నారు. ప్ర‌జా చైత‌న్యాన్ని డ‌బ్బు, అధికార బ‌లంతో అణచివేయ‌లేర‌న్నారు. తెలంగాణ‌లోకెసీఆర్ రాజ్యాంగం అమ‌ల్లో ఉంద‌న్నారు.

Next Story
Share it