Telugu Gateway
Politics

ఈటెల గుండెలు అదురుతున్నాయి

ఈటెల గుండెలు అదురుతున్నాయి
X

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పై మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్ లో జరిగే ఎన్నిక న్యాయానికి - అన్యాయానికి, ధర్మానికి - అధర్మానికి మధ్య జరిగే ఎన్నిక అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా మూడున్నర సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టి ఎన్ని యూనిట్ల కరెంటు రైతులు కాలుస్తున్నారో లెక్కలు తీయమని చెపుతోంద‌ని విమ‌ర్శించారు. డీజీల్ రేట్లు పెంచి రైతుల మీద భారం వేసింది. ఒక్క ఎకరా వ్యవసాయం చేయడానికి ఐదు వేల రూపాయలు సంవత్సరానికి భారం వేసింద‌న్నారు. రైతుల సంక్షేమం కోసం పని చేసే టీఆర్ఎస్ గెలవాలా....కోతలు వాతలు పెట్టే బీజేపీ గెలవాలా.... ఆలోచించండ‌న్నారు. రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మావేశానికి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చారని ఈటల కామెంట్ చేశారు. పక్క ఊరోళ్లు ఒక్కరన్నా వచ్చారా.... ఆయనకు గుండెలు అదురుతున్నాయి. ఏం చెప్పాలో తెలియక పక్క ఊరి నుంచి వచ్చారని చెబుతున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో... రాజేందర్ మాటల్లో నిజం అంతే ఉంటుంది. భోజనం కోసం, మందు కోసం వస్తున్నారని చెబుతున్నారు.

హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడతున్నారు. ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. ఆరు సార్లు నిన్ను గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను కించపరుస్తున్నారు. అవమానపర్చేలా మాట్లాడుతున్న రాజేందర్ కు మీరే తగిన గుణపాఠం చె్పాలి. చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి మీరు ఏం చేయదల్చుకున్నరు. మీ స్వార్థం కోసం పార్టీ మారారు. బీజేపీ ఏ ర కంగా హుజూరాబాద్ ప్రజలకు మేలు చేస్తోందో చెప్పు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, చేతనైతే హుజూరాబాద్ కు వెయి కోట్ల ప్యాకేజీ ఇప్పించు. గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు.. ఇప్పించు చూద్దాం. దమ్ముంటే ఇవి తీసుకురా... ప్రతీ అక్కౌంట్ లో15 లక్షలు వేస్తామన్నారు. నీకు చైతనైతే 15 లక్షలు వేయించు. నల్ల ధనం వెనక్కు తెస్తామన్నారు..... తెప్పించు.. చూద్దాం. నీ స్వార్థం కోసం హూజూరాబాద్ ప్రజలకు, రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదా..నువు మాత్రం బాగుండాలా అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it