కాంగ్రెస్, బిజెపిల్లో వణుకు

తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు ప్రారంభం అయిందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది కేసీఆర్ చేసి చూపించారని, తెలంగాణలోని పల్లెలు అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యిందన్నారు. కాంగ్రెస్ హయాలంలో ఒక్క గ్రామం అయినా అభివృద్ధి చెందిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు.
ప్రభుత్వ తీరును సీఎల్పీ నేతల మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. బడ్జెట్ ప్రకటనలకే పరిమితం అవుతోందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా ఇది అమలు జరగడం లేదని మండిపడ్డారు. ప్రతీ ఏడాది బడ్జెట్‌పెంచుకుంటూ పోతున్నారని, అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతూ వస్తున్నారని విమర్శించారు. పెరిగిన ధరలను బట్టి డబుల్ బెడ్రూం ఇళ్లకు 8 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 8 ఏళ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని, పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.