Telugu Gateway
Politics

రెండు గుంట‌ల గెల్లుకు..రెండు వంద‌ల ఎక‌రాల ఈటెల‌కు మ‌ధ్యే పోటీ

రెండు గుంట‌ల  గెల్లుకు..రెండు వంద‌ల ఎక‌రాల ఈటెల‌కు మ‌ధ్యే పోటీ
X

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీష్ రావు బుధ‌వారం నాడు హూజూరాబాద్ నియోజ‌కవ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బుధ‌వారం నాడు బైక్ ర్యాలీల‌తోపాటు నియోజ‌క‌వ‌ర్గంలో నేరుగా బ‌రిలోకి దిగారు. రెండు‌కుంటల భూమి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు , రెండు వందల‌ ఎకరాల ఆసామి ఈటలకు మధ్యే పోటీ అని హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. బిజెపిలోకి వెళ్ళాక ఈటెల రాజేంద‌ర్ కొత్త భాష నేర్చుకున్నార‌ని ఎద్దేవా చేశారు. గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ కు సీఎం కెసీఆర్ తోపాటు రాష్ట్ర మంత్రివ‌ర్గం అంతా అండ‌గా ఉంటుంది..ఆశీస్సులు అందిస్తుంద‌ని తెలిపారు. త‌మ పార్టీ అభ్య‌ర్ధి గెలుపు ప‌క్కా అన్నారు. హూజూరాబాద్ లో పోటీ పోటీ టీఆర్ఎస్ , బీజేపీల మధ్యే అని కాంగ్రెస్ పోటీలోనే లేద‌న్నారు. మంత్రిగా పనులు చేయని రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఏం చేచేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఆసరా పెన్షన్ ఇచ్చే కేసీఆర్ ‌కావాలా...ధరలు పెంచే బీజేపీ‌కావాలా అని ప్ర‌శ్నించారు. తండ్రి‌లాంటి‌ కేసీఆర్ ను రా అని సంభోధిస్తూ..నన్ను ఓరేయ్ హరీశ్ అని పిలుస్తున్నాడ‌ని ఈటెల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. హుజూరాబాద్ ఆశీర్వాద స‌భ‌లో హ‌రీష్ రావు మాట్లాడారు.

రాజకీయ ఓనమాలు‌నేర్పి, ఆరు సార్లు ఎమ్మెల్యే ని చేసి, రెండు సార్లు మంత్రి పదవులిచ్చిన సీఎంపై ఇలా సంబోధించ‌టం స‌రికాద‌న్నారు. ఈటెల రాజేంద‌ర్ ఆస్థులు‌ కాపాడుకోవడానికి బీజేపీ లో‌ చేరార‌ని, సిద్దాంతాలు వదిలేశాడ‌ద‌న్నారు. ఈటెల ఎలా పిలిచినా తాను మాత్రం రాజేందర్ గారు అనే పిలుస్తాన‌న్నారు. ఓటమి భయంతో మాటలు తూలుతున్నార‌ని ఆరోపించారు. కేసీఆర్ పేదవాడి ఆత్మగౌరవం కోసం నాలుగు వేల ఇళ్లు మంజూరు చేస్తే ఒక్క ఇల్లైనా కట్టావా...మంత్రిగా గెలిచి ఒక్క ఇల్లు కట్టలేని వాడు..ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఏం చేస్తాడ‌న్నారు. రాజేందర్ గెలిస్తే వ్యక్తిగా ఆయనకు లాభం, టీఆర్ఎస్ గెలిస్తే 2 లక్షల 29 వేల మంది హుజూరాబాద్ ప్రజలకు లాభం అని తెలిపారు. అసలు ఎమ్మెల్యే ‌గా ఈటల‌రాజేందర్ ఎందుకు రాజీనామా చేశార‌న్నారు. కేవలం నీ స్వార్థం‌కోసమే రాజీనామా చేశావ్ కదా అని ప్ర‌శ్నించారు. హుజూరాబాద్ లో ప‌ది కోట్లతో రామాల‌యం క‌ట్టుకుందామ‌న్నారు.

Next Story
Share it