Telugu Gateway
Politics

కాంగ్రెస్ లోకి హ‌ర్భ‌జ‌న్ సింగ్!

కాంగ్రెస్ లోకి హ‌ర్భ‌జ‌న్ సింగ్!
X

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న పంజాబ్ లో కీల‌క ప‌రిణామం. భారత క్రికెట్ జట్టు వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ తాజాగా ట్విట్టర్‌లో ఇద్దరూ కలుసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో హర్బజన్ సింగ్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారనే ఊహాగానాలకు ఊతం వ‌చ్చింది. తొలుత హ‌ర్భ‌జ‌న్ సింగ్ బిజెపిలో చేర‌తార‌నే వార్త‌లు రాగా..వాటిని ఆయ‌న ఖండించారు. హర్బజన్ సింగ్ బుధవారంనాడు సిద్ధూను కలుసుకున్నారు.

ఇద్దరూ కులుసుకున్న ఫోటోను షేర్ చేసిన సిద్ధూ... ''పిక్చర్ లోడెడ్ విత్ పాజిబిలిటీస్...విత్ బజ్జీ ది షైనింగ్ స్టార్'' అంటూ ట్వీట్ చేశారు. దీంతో హ‌ర్భ‌జ‌న్ సింగ్ కాంగ్రెస్ లో చేరిక ఖాయం అనే అంద‌రూ భావిస్తున్నారు. కేంద్రం తీసుకువ‌చ్చిన రైతు చ‌ట్టాల‌తో పంజాబ్ లో బిజెపిపై రైతుల‌తోపాటు ప‌లు వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రోవైపు ఆప్ కూడా శ‌క్తివంచ‌న‌లేకుండా పంజాబ్ పై ప‌ట్టు సాధించే ప‌నిలో ఉంది.

Next Story
Share it