మోడీకి అసలు సిసలు పరీక్ష ఇదే!
ఇన్ని సమస్యలను అధిగమించి బీజేపీ మరో సారి గుజరాత్ లో అధికారాన్ని నిలబెట్టుకుంటే అది కూడా పెద్ద సంచలనమే అవుతుంది. గుజరాత్ లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మరో వైపు ఆప్ కూడా గుజరాత్ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ కంటే అప్ ప్రచారం విషయంలో దూకుడు మీద ఉంది. మరి ఫలితం ఎలా ఉంటది అన్నది తెలియాలి అంటే డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే. 182 సీట్లు ఉన్న గుజరాత్ అసెంబ్లీ కి డిసెంబర్ 1 ..డిసెంబర్ 5 అంటే రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మహారాష్ట్రలో ఏర్పాటు చేయాల్సిన వేదాంత ఫాక్స్ కాన్ చిప్ యూనిట్ తో పాటు టాటా, ఎయిర్ బస్ ల విమానాల తయారీ యూనిట్ కూడా అక్కడికి తరలించిన విషయం తెలిసిందే. ఈ రెండు యూనిట్స్ కలిపితే ఏకంగా లక్షన్నర కోట్ల ప్రాజెక్టులు తరలించుకు వెళ్లినట్లు అవుతుంది. గత కొన్ని రోజులుగా మోడీ గుజరాత్ లో వేల కోట్ల రూపాయల పనులను శ్రీకారం చుట్టారు.