Telugu Gateway
Politics

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
X

హోరాహోరీగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే ఒక్కో సంస్థ ఒక్కో రకమైన ఫలితాలను వెల్లడించింది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం అన్నింట్లోనూ లీడ్ మాత్రం అధికార టీఆర్ఎస్ వైపే ఉంది. మొదటి నుంచి మేయర్ పీఠం ఆ పార్టీ చేజారుతుందని ఎవరూ అనుకోకపోయినా..99 సీట్ల నుంచి టీఆర్ఎస్ ను ఎన్ని తక్కువ సీట్లకు పరిమితం చేస్తారన్నదే కీలకంగా మారింది. బిజెపి అనూహ్యంగా గట్టి ప్రత్యర్ధిగా మారటంతో రాజకీయం రంజుగా మారింది. జీహెచ్‌ఎంసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సర్వే సంస్థలు గురువారం సాయంత్రం వెల్లడించాయి. ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారైన కారణంగా రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ ముగిసేవరకూ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించేందుకు అనుమతి లేకపోవడంతో.. డిసెంబర్ 1 సాయంత్రం వెల్లడి కావాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ ‌ను గురువారం సాయంత్రం వెల్లడించారు. టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముందంజలో ఉంది. 68 నుంచి 78 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించనున్నట్లు పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ లో వెల్లడించింది. టీఆర్‌ఎస్‌ 68-78(ఓట్‌ షేర్‌ 38%), ఎంఐఎం 38-42 (ఓట్‌ షేర్‌ 13%), బీజేపీ 25-35 (ఓట్‌ షేర్‌ 32%), కాంగ్రెస్‌ 1-5 (ఓట్‌ షేర్‌ 12%), ఇతరులు- 5 శాతం ఓట్‌ షేర్‌ సాధించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

బీజేపీ గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినట్టుగా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్స్‌ లో వెల్లడైంది. నాగన్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే టీఆర్‌ఎస్‌ 95-101(ఓట్‌ షేర్‌ 46.84%), ఎంఐఎం 35-38 (ఓట్‌ షేర్‌ 14.04%), బీజేపీ 5- 12 (ఓట్‌ షేర్‌ 26.50%), కాంగ్రెస్‌ 0-1 (ఓట్‌ షేర్‌ 9.29%) గా అంచనా వేశారు. సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే టీఆర్‌ఎస్‌ 82-96(ఓట్‌ షేర్‌ 39.08%), ఎంఐఎం 32-38 (ఓట్‌ షేర్‌ 13.04%), బీజేపీ 12- 20 (ఓట్‌ షేర్‌ 27.09%), కాంగ్రెస్‌ 3-5 (ఓట్‌ షేర్‌ 14.07%)గా వెల్లడించారు. హెచ్ఎంఆర్ రిసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్‌ఎస్‌ 65-70, ఎంఐఎం 35-40, బీజేపీ 27- 31, కాంగ్రెస్‌ 3-6, ఇతరులు 3గా తెలిపారు.

Next Story
Share it