జీహెచ్ఎంసీ ఫలితాలు...పోస్టల్ బ్యాలెట్లలో బిజెపి హవా
BY Admin4 Dec 2020 9:48 AM IST
X
Admin4 Dec 2020 9:48 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లలో బిజెపి హవా కన్పిస్తోంది.అధికార టీఆర్ఎస్ కంటే బిజెపికే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. అయితే ఈ ట్రెండ్ పై ఇప్పటికే నిర్ధారణకు రావటానికి కష్టం అవుతుందనే చెప్పొచ్చు. సరిగ్గా 9.45గంటల సమయంలో బిజెపి పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చూస్తే ఏకంగా 70 డివిజన్లలో లీడ్ లో ఉండగా...టీఆర్ఎస్ 32 డివిజన్లలో, ఎంఐఎం12 డివిజన్లలో లీడ్ లో ఉంది..
జీహెచ్ఎంసీ ఎన్నికలను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా హోం మంత్రి అమిత్ షా, జె పీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అధికార టీఆర్ఎస్ దీన్ని ఎద్దేవా చేసినా ఎన్నిక ఏదైనా తాము ఇలాగే తీసుకుంటామని బిజెపి నేతలు కౌంటర్ ఇచ్చారు.
Next Story