Telugu Gateway
Politics

రాముడు ఎక్కడ పుట్టాడో తెలవాలి ముందు?

రాముడు ఎక్కడ పుట్టాడో తెలవాలి ముందు?
X

మరో టీఆర్ఎస్ నేత రాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదు, ఇటీవల నేపాల్‌ ప్రధాని.. రాముడు తమ దగ్గరే జన్మించాడని చెప్పారు. అసలు రాముడు భారతదేశంలో పుట్టాడా.. నేపాల్‌లో పుట్టాడా.. జర్మనీలో పుట్టాడో తేలాల్సి ఉంది'అని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి వ్యాఖ్యానించారు. అయోధ్యలో రాముడు మనకెందుకు?.మన దగ్గర రామాలయాలు లేవా అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే పిడమర్తి రవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

కరీంనగర్‌లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రాజ్యాంగ రక్షణ సదస్సు'లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్నమొన్నటి నుంచి చందాల దందా మొదలైందని, అయోధ్య రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని, రానున్న రోజుల్లో జై భీమ్‌– జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుందన్నారు.. ఎంపీ బండి సంజయ్‌ ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి నిత్యం గుళ్లు, గోపురాలంటూ టీఆర్‌ఎస్‌ను విమర్శించడం తగదని అన్నారు. దళితులు హిందువులే అయితే ఆలయాల్లోకి ప్రవేశం ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు.

Next Story
Share it