Telugu Gateway
Politics

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో ఫైటింగ్ !.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో ఫైటింగ్ !.
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో సోమవారం ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా అసెంబ్లీ వేదికగా తోపులాటలు...దాడి జరిగినట్లు ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ లు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. తొలుత టీడీపీ తమ సభ్యుడిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారు అని ఆరోపిస్తుంటే...టీడీపీ సభ్యులు స్పీకర్ పై దాడి కి ప్రయత్నించారు అని వైసీపీ ఆరోపిస్తోంది. జీఓ 1 రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం ఎక్కిమరి టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఆ సమయంలోనే ఘర్షణ చోటుచేసుకుంది. ఈ పరస్పర ఆరోపణల మధ్య స్పీకర్ మొత్తం వీడియో ఫుటేజ్ విడుదల చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని టీడీపీ చెపుతోంది.

తాము స్పీకర్ పై దాడి చేసినట్లు తేలితే ఎలాంటి శిక్ష వేసిన ఓకే అంటూ టీడీపీ సభ్యులు చెపుతున్నారు. తమ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పై సుధాకర్ బాబు దాడి చేశారు అన్నది టీడీపీ ఆరోపణ, అదే సమయంలో బుచ్చయ్య చౌదరి దగ్గర ఉన్న ప్ల కార్డు వైసీపీ సభ్యులు లాక్కెళ్లారు అని టీడీపీ ఆరోపిస్తోంది. సుధాకర్ బాబు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే లు తనపై దాడి చేశారు అని చెపుతున్నారు. స్పీకర్ ఫుటేజ్ విడుదల చేయాలని తాము కూడా కోరతామన్నారు. స్పీకర్ పై దాడికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు అని వైసీపీ విమర్శిస్తోంది. ఈ తరుణంలో టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.

Next Story
Share it