ట్రంప్ ను అలా వదిలిపెడితే కష్టం
రెండు వారాల పాటు ఫేస్ బుక్..ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు బ్లాక్
ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అలా వదిలేస్తే కష్టం అని..అందుకే అమెరికాలో అధికార బదిలీ సాఫీగా సాగేంత వరకూ ఆయనకు చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలను ఉపయోగించటానికి అనుమతిస్తే ప్రమాదాలు పొంచిఉన్నట్లు గుర్తించామని తెలిపారు. జుకర్ బర్గ్ ప్రకటన ప్రకారం చూస్తే అమెరికాలో కొత్తగా ఎన్నికైన జో బైడెన్ బాధ్యతలు చేప్టటిన తర్వాతే ట్రంప్ ఖాతాలను పునరుద్ధరించే అవకాశం కన్పిస్తోంది. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలు గమనిస్తే మిగిలిన సమయంలో కూడా ట్రంప్ కూడా అడ్డంకులు సృష్టించే అవకాశం కన్పిస్తోందని పేర్కొన్నారు.
క్యాపిటల్ భవనం వద్ద జరిగిన చర్యలను ఖండించాల్సిన చర్యలను ట్రంప్..వాటికి మద్దతు ఇచ్చేలా మాట్లాడటం అమెరికా ప్రజలను..ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని తెలిపారు. అందుకే తాము ఆయన స్టేట్ మెంట్స్ ను తొలగించామని తెలిపారు. అమెరికా కాంగ్రెస్ కూడా జో బైడెన్ గెలుపును నిర్ధారించినందున మిగిలిన 13 రోజులు కూడా ప్రజాస్వామ్య నిబంధనల ప్రకారం సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రెసిడెంట్ ట్రంప్ ను తాము తమ ఫ్లాట్ ఫామ్స్ ఉపయోగించుకునే అవకాశం కల్పించామని..తమ విధానాలు ఉల్లంఘించిన పోస్టులను తొలగించామని తెలిపారు.