టీడీపీకి పడాల అరుణ రాజీనామా
BY Admin30 Jan 2021 1:32 PM IST
X
Admin30 Jan 2021 1:32 PM IST
పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీకి ఎదురుదెబ్బ. విజయనగరం జిల్లాలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పడాల అరుణ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా ప్రతాన్ని పార్టీ అధ్యక్షుడికి పంపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పడాల అరుణ తెలిపారు. అటు అధిష్టానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రాష్ట్ర కమిటిలలో సైతం చోటు కల్పించకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న అరుణ.. టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉందని సమాచారం.
Next Story