Telugu Gateway
Politics

2023 తర్వాత నువ్వూ ఉండవు..నీ అధికారం ఉండదు

2023 తర్వాత నువ్వూ ఉండవు..నీ అధికారం ఉండదు
X

ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కారం తో మర్యాద పాటిస్తున్నానని..సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారని హెచ్చరించారు. ఆయన మంగళవారం నాడు హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు..'ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా?. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా మీరు సాయం చేశారా ?.తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడు వెయ్యేళ్ళు బ్రతకరు. అధికారం శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నవు. బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నావు. నువు ఎన్ని టాక్స్ లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా? టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. నీ కథ ఎందో అంతా తెలుసు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది.

అదే గతి నీకు పడుతుంది. 2006 లో కరీంనగర్ లో ఎంపీ గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. హుజూరాబాద్ లో మా మిత్రుడికి ఇంఛార్జి ఇచ్చినట్టు తెలిసింది. కానీ మొన్న ఎంపీ ఎన్నికలలోనూ మిగతా అన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వేస్తే.. 54 వేల మెజారిటీ ఇచ్చి ఆదుకున్న నియోజక వర్గం హుజురాబాద్. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరు కొనలేరు.ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తా.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it