Telugu Gateway
Politics

సమైక్య పాలనలోనూ ఇన్ని ఇబ్బందులు లేవు

సమైక్య పాలనలోనూ ఇన్ని ఇబ్బందులు లేవు
X

కెసీఆర్ అప్పటి ఆస్తులెంత?..ఇప్పుడెంత?

మేం ఏమైనా ఉగ్రవాదులమా?. ఇంటి చుట్టూ పోలీసులు ఎందకు?

బంధువులు వచ్చినా ఆరా తీస్తారా?

ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఈటెల రాజేందర్ భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్మీ తమ్మీ అని తడిగుడ్డతో గొంతు కోశారని ఆరోపించారు. సమైక్య పాలనలో కంటే తెలంగాణలోనే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని వ్యాఖ్యానించారు. తాము ఏమైనా ఉద్రగవాదాలమా ఇంటి చుట్టూ ఎందుకు పోలీసులను పెడుతున్నారు అని ప్రశ్నించారు. ఇంటి దగ్గరా..తమ హ్యాచరీల దగ్గరా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళను ఇక్కడ ఏమి పని అంటే తమ డ్యూటీ ఇక్కడే అని చెబుతున్నారని విమర్శించారు. ఉద్యమంలోకి రాక ముందు కెసీఆర్ ఆస్తులు ఎంత?. ఇప్పుడు ఆస్తుల ఎంత?. చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈటెల జమున ఆదివారం నాడు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇందులోని ముఖ్యాంశాలు..'జమున హ్యాచరిస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుంది. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తెలుసు. కష్టపడి పైకి వచ్చాం... ఎవరిని మోసం చేయలేదు. మాసాయి పేటలో 46 ఎకరాలు కొనడం జరిగింది.

కొన్నదాని కంటే ఒక ఎకరా భూమి ఎక్కువగా ఉన్న ముక్కు నేలకు రాస్తా. మీరు ముక్కునేలకు రాస్తారా. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా. నమస్తే తెలంగాణ పత్రిక కోసం స్థలం ఇచ్చాము. అదే పత్రిక మాపై దుష్ప్రచారం చేయడం బాధాకరం. వావివరసలు మరిచి అధికారులు రిపోర్ట్ ఇవ్వడం ఏంటి?.దేవర యాంజల్ భూములు 1994 లో కొనుగోలు చేశాం. మా గోదాములు ఖాళీ చేయించాలని, ఆర్థిక వనరులు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. మేము 6 ఎకరాలు కుదువ పెట్టి నమస్తే తెలంగాణ కు ఇచ్చాం. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవ లేవు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి. సమైక్యాంధ్రలోనే ఆత్మ గౌరవంతో బ్రతికినం.. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవు. గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్ మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.

ఉద్యమంలో ఈటెల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..?. నేను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపాను. నా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారు. ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగండి. నా ఆస్తులు అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటా. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమే. నయీమ్ చంపుతాను అంటే భయపడలేదు. అధికారం ఉందని ఏమి చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటు. వైఎస్సార్ పార్టీలోకి అహ్వానిస్తే వెళ్లని వ్యక్తిత్వం. వకులాభారణం మొహం చూసి ఒక్క ఓటు పడతదా. ఉద్యమంలో ఈటెల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవు. పోలీసులు మా కుటుంబం కోసమే పని చేస్తున్నారా.

సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవు. రెడ్డి-ముదిరాజ్ లమని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? కులాల పేరుతో పాలన చేస్తున్నారు రావల్ కోల్ భూముల్లో లాజిస్టిక్ పార్క్ పెడతామని వారికి చెప్పి కొన్నాం.. అప్పుడు తెలియదా. ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదు. ఒక్క ఎకరా కొన్న వారికి చెప్పే కొన్నాం. అన్యాయం చేయలేదు..దోపిడీ చేయలేదు..న్యాయం గెలుస్తుంది.. ధర్మమే నిలబడుతుంది. మా జమున హేచరీష్ సర్వే చేయవద్దని చెప్పలేదు . జమనా హెచరీష్ మా సమక్షంలో సర్వే చేయమని చెప్పాము. తెలంగాణ కోసం కొన్నిఆస్తులను అమ్ముకున్నా... ఈటెల రాజేందర్ చేసే ఆత్మగౌరవ పోరాటానికి యావదాస్తిని అయినా అమ్మడానికి సిద్ధంగా ఉన్నా. ఉద్యమం వదిలి రమ్మని వైఎస్సార్ వెంట రావాలని అప్పటి దేవాదాయశాఖ మంత్రి రత్నాకర్ రావు చాలా చెప్పారు... కానీ ఈటెల వెళ్ళలేదు. కేసీఆర్ వాల్లు మంచోళ్లు కాదని అప్పుడే చెప్పారు. రాష్ట్రం లో మంత్రులు కూడా మినిష్టర్ క్వార్టర్లలో దొంగచాటుగా కలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తమ్ముడు తమ్ముడు అంటూనే కేసీఆర్ తడి బట్టతో గొంతు కోశారు. స్కెచ్ వేసి రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి భయ భ్రాంతులకు గురి చేశారు.

కేసీఆర్ కి న్యాయం లేదు.. ధర్మం లేదు.. ఆయన చెప్పింది రాత్రికి రాత్రి కావాలని అనుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక ఇప్పుడు సమాజాన్ని కులాలతో విభజన చేస్తున్నారు. అన్ని కులాల వారు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. అందరికి స్వేచ్ఛ కావాలి.. అందరూ ఆర్ధికంగా ఎదగాలి. తెలంగాణ వచ్చాక అవమానాలు పెరిగాయి. సమైక్య పాలనలోనే సైతం సంతోషం ఉన్నాము. పౌల్ట్రీలు అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశాము రెండు వేల కోళ్ల ఫారమ్ నుంచి 8 లక్షల కోళ్ల ఫాం స్థాయికి ఎదిగాం. పోలీసులతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తే..భయపడేది లేదు. మా ఆస్తులు పోయినా.. కష్ట పడి సంపదిస్తా అనే ధైర్యం ఉంది . తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పనిచేస్తాం.టక్కు టమారాలు.. గోకర్ణ విద్యలు నడవవు.' అని వ్యాఖ్యాంచారు.

Next Story
Share it