Telugu Gateway
Politics

విచారణ..శాఖ తొలగింపు..మంత్రి పదవి నుంచి తప్పించటం

విచారణ..శాఖ తొలగింపు..మంత్రి పదవి నుంచి తప్పించటం
X

ముందు విచారణ..తర్వాత శాఖ తొలగింపు..తర్వాత మంత్రి పదవి నుంచి తొలగింపు. ఇదేనా వరస క్రమం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అచ్చం ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోంది. శనివారం సాయంత్రం నుంచి తెలంగాణలో రాజకీయ పరిణామమాలు చకచకా ముందుకు సాగుతున్నాయి. కెసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో అసైన్ మెంట్ భూముల కబ్జా వ్యవహారంపై అధికారులు కూడా ఆగమేఘాల మీద విచారణ జరిపారు. ప్రాథమికంగా అందులో అసైన్ మెంట్ భూములు ఉన్నాయని గుర్తించినట్లు కలెక్టర్ హరీష్ అధికారికంగా ప్రకటించారు. అంతే ఆ తర్వాత కొద్దిసేపటికే ఈటెల రాజేందర్ దగ్గర నుంచి వైద్య ఆరోశ్య శాఖ ను ముఖ్యమంత్రి కెసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ కార్యాయలం నుంచి ప్రకటన వెలువడింది.

దీంతో ప్రస్తుతం ఈటెల ఏ శాఖ లేని మంత్రిగా ఉండనున్నారు. ఈటెల మంత్రి పదవులను తనకు బదిలీ చేయాలంటూ కెసీఆర్ చేసిన సిఫారసును గవర్నర్‌ ఆమోదించారు. శాఖ తొలగింపు అంశంపై ఈటెల రాజేందర్ స్పందించారు. మరింత మెరుగ్గా చేయటానికి సీఎం కెసీఆర్ తన శాఖను తీసుకుని ఉంటారని వ్యాఖ్యానించారు. ఏ మంత్రి దగ్గర నుంచి అయినా శాఖ తీసే సే అధికారం సీఎంకు ఉంటుందని, శాఖ లేకపోయినా ప్రజలకు మరింత సేవ చేస్తానన్నారు. అయితే అంతా ఓ పథకం ప్రకారమే సాగుతుందని తెలిపారు.

Next Story
Share it