Telugu Gateway
Politics

సోనియా..రాహుల్ కు ఈడీ స‌మ‌న్లు

సోనియా..రాహుల్ కు ఈడీ స‌మ‌న్లు
X

కీల‌క ప‌రిణామం. ఇక అస‌లు వారినే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీ,ఆ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీకి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ ప‌రిణామం ఒక్క‌సారిగా సంచ‌ల‌నంగా మారింది. ఈ ప‌రిణామంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు(గురువారం) రాహుల్‌ గాంధీని, జూన్‌ 8వ తేదీ లోపు సోనియా గాంధీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు విచారణకు రావాలంటూ సమన్లు ​​జారీ చేయడం విశేషం.

1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారు, ఆ సమయంలో బ్రిటిష్ ప్ర‌భుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఇందుకోసం ఈడీని ఉపయోగిస్తోంది. అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ చెప్పిన తేదీకి హాజరవుతారని, అయితే రాహుల్ గాంధీకి మాత్రం కొంత వ్యవధి కావాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ.. దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తుందని ధృవీకరించారు. అయితే మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. అటు మ‌హారాష్ట్ర‌ లోనూ అధికార పార్టీ మంత్రుల‌ను టార్గెట్ చేసిన‌ట్లు ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. తాజాగా ఆప్ ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it