కెసీఆర్ కు బానిసలుగా ప్రకటించుకోండి
పోలీసులకు ఈటెల వార్నింగ్
నా వల్లే దళితులకు స్కీమ్ లు.
అత్యుత్సాహం ప్రదర్శించవద్దని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని అన్నారు. తాము ఏమైనా నక్సలైట్లమా అని ప్రశ్నించారు. లేదంటే గులాబీ కండువా వేసుకుని కెసీఆర్ బానిసలుగా ప్రకటించుకోండి అన్నారు. ఏడేళ్లలో ఎప్పుడూ మేలు చేయని దళితులు కెసీఆర్ కు ఇప్పుడు గుర్తుకొచ్చారన్నారు. దళితులకు పది లక్షల స్కీమ్ ప్రకటించి...ఒక్క హుజూరాబాద్ నియోజకర్గానికే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట. దీన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పది లక్షలు తీసుకుని తనకే ఓటు వేయాలన్నారు. దళితులు అయినా..సర్పంచ్ లు అయినా హుజూరాబాద్ లో డబ్బులకు అమ్ముడుపోరని అన్నారు.
హుజూరాబాద్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు అమలు చేస్తున్న స్కీమ్ లు తమ తమ నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు ఈటెల. తన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఏ ప్రయోగాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తన వెంటే ఉంటారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగానైనా ఉద్యోగాల నియామకాలు జరగాలి. ఓటు పదివేల రూపాయలు ఇస్తారట.. తీసుకోండి కమలం గుర్తుకు ఓటు వేయండి. డబుల్ బెడ్రూం ఇళ్లు సొంతంగా నిర్మించుకునే అవకాశం కల్పించాలన్నారు.