Telugu Gateway
Politics

ప‌ర‌మ‌నీచ‌పు నాయ‌కులు టీఆర్ఎస్ వాళ్లు

ప‌ర‌మ‌నీచ‌పు నాయ‌కులు టీఆర్ఎస్ వాళ్లు
X

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ అధికార టీఆర్ఎస్ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. టీఆర్ఎస్ నీచ‌పు పార్టీ...ఆ ఆ పార్టీ నాయ‌కులు ప‌ర‌మ‌నీచంగా త‌యార‌య్యారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. స్వ‌యంగా మంత్రులు..ఎమ్మెల్యే దావ‌త్ ల‌కు నాయ‌క‌త్వం వ‌హించే స్థితికి దిగ‌జారిపోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటూ మండిప‌డ్డారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయిన త‌ర్వాత ఆయ‌న ఓ స‌మావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ కుట్ర‌లు..కుతంత్రాల‌ను చేధించ‌గ‌ల గ‌డ్డ అన్నారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి, మంత్రుల ప‌ర్య‌వేక్షణ‌లో దొంగ ఓట్లు చేర్పించే ప్ర‌క్రియ సాగుతోంద‌ని..క‌డుపు మండిన అధికారులే త‌న‌కు స‌మాచారం ఇచ్చార‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు త‌మ ఇళ్ళ‌పై దొంగ ఓట్లు లేకుండా చూసుకోవాల‌ని కోరారు. ద‌మ్ము, ధైర్యం, ప్ర‌జ‌ల‌పై న‌మ్మకం ఉంటే ప్ర‌జాస్వామ్యయుతంగా గెలిచే ప్ర‌య‌త్నం చేయండి కానీ చిల్ల‌ర ప‌నుల‌ను స‌హించ‌మ‌న్నారు.

అధికార పార్టీ ఎన్ని రకాలుగా వేధింపుల‌కు గురిచేసినా యువ‌త‌, ఉద్యోగులు, పెద్ద‌లు, పిన్న‌లు అంద‌రూ జై ఈటెల‌, జై బిజెపి అంటున్నారు త‌ప్ప మ‌రో మాట లేద‌న్నారు. త‌న‌కు అండ‌గా నిలిచిన వారి రుణం ఎన్ని జ‌న్మ‌లెత్తినా తీర్చుకోలేన‌న్నారు. త‌నకు షేక్ హ్యాండ్ ఇచ్చాడ‌ని ఓ కండ‌క్ట‌ర్, త‌న‌ను క‌లిసినందుకు ఓ ఆశా వ‌ర్క‌ర్ ను బ‌దిలీ చేశార‌న్నారు. హుజూరాబాద్ లో 22 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తే వాళ్ళ‌ను కూడా తీసేశార‌ని తెలిపారు. కండువా మార్చుకుంటేనే ఉద్యోగం ఉంటుంద‌ని హెచ్చ‌రించార‌ని తెలిపారు. పీఎం కెసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని విమర్శించారు. రాత్రి పూట పోలీస్ జీపులతో బీజేపీ నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. అక్టోబర్ 2న హుజురాబాద్‌లో బండి సంజయ్ ర్యాలీ ఉంటుందని ఈటల రాజేందర్ చెప్పారు.

Next Story
Share it