Telugu Gateway
Politics

హుజూరాబాద్ లో పోటీకి కెసీఆర్..హ‌రీష్ వ‌చ్చినా ఓకే

హుజూరాబాద్ లో పోటీకి కెసీఆర్..హ‌రీష్ వ‌చ్చినా ఓకే
X

వ‌స్త‌వా రావు హ‌రీష్ రావు. హూజూరాబాద్ లో పోటీచేద్దువు గానీ. కెసీఆర్ వ‌స్త‌వా రా. బ‌క్క ప‌లుచ‌ని వ్య‌క్తి అనుకున్న‌వేమో. హుజూరాబాబాద్ ప్రజ‌ల్లో గుండెల్లో పెట్టుకున్న‌రు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్. 'దమ్ముంటే నిజాయితీగా ఓట్లు వేయించుకోండి. ప్రలోభాలు, దావతులు ఆపండి' అని వ్యాఖ్యలు చేశారు. పోలీస్, ఇంటలిజెన్స్ వాళ్ళను వెనక్కితీసుకోండని, నా మనుషులను బయపెట్టడం ఆపండన్నారు. కనీసం తన డిపాజిట్‌ను టచ్ చేయగలరా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కి హుజురాబాద్ దళితుల మీద ప్రేమ లేదు కానీ వారి ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల మాటల్లో, చేతల్లో నిజాయితీ లేదన్నారు. హుజురాబాద్‌లో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it