Telugu Gateway
Politics

టీఆర్ఎస్ ను కైవ‌సం చేసుకోవాల‌ని హ‌రీష్ ప్ర‌య‌త్నాలు

టీఆర్ఎస్ ను కైవ‌సం చేసుకోవాల‌ని హ‌రీష్ ప్ర‌య‌త్నాలు
X

హ‌రీష్ ఎంత చేసినా కెసీఆర్ నిన్ను న‌మ్మ‌రు

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆర్ధిక మంత్రి హ‌రీష్ రావు ఎలాగైనా ఈటెల‌ను ఓడించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టంతో ఆయ‌న కూడా హ‌రీష్ ను టార్గెట్ చేశారు. గురువారం నాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏనాటికైనా టీఆర్ఎస్ ను కైవ‌సం చేసుకోవాల‌ని హ‌రీష్ రావు చూస్తున్నార‌ని..అది సాధ్యం కాద‌న్నారు. మ‌న‌ది ప‌ద్దెనిమిదేళ్ళ అనుబంధం అంటూ...త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే చ‌రిత్ర ఆయ‌న్నుక్షమించ‌ద‌న్నారు. న్యాయం, ధ‌ర్మానికి విరుద్ధంగా ప్ర‌చారం చేస్తే చ‌రిత్ర‌లో చుల‌క‌న అవుతార‌ని వ్యాఖ్యానించారు. తన ఆస్తులపై విచారణ జరపాలని అలాగే మీ ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని, ఎవరిసంపాదన ఏంతో తేలిపోతుందన్నారు. ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, సిద్ధాంతపరమైన విమర్ళలు చేయాలన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ అన్నారు.

దుబ్బాక‌లో హ‌రీష్ ఎంత ప్ర‌చారం చేసినా క‌ర్రుకాల్చి వాతపెట్టార‌ని..హూజూరాబాద్ ప్ర‌జ‌లు కూడా అదే చేస్తార‌న్నారు. త‌న‌తోపాటు 11 మందిని ఓడించేందుకు కెసీఆర్ ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. హ‌రీష్ ఓట‌మి కోసం కూడా ప్ర‌త్య‌ర్ధుల‌కు డ‌బ్బులిచ్చార‌న్నారు. ప్ర‌భుత్వ ఖ‌జానా అంత నిండుగా ఉంటే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లుకు డ‌బ్బులు ఎందుకు ఇవ్వ‌టంలేద‌ని ప్ర‌శ్నించారు. రైతు బంధు రాష్ట్రం అంతా అమ‌లు చేస్తూ ద‌ళిత బంధు ఒక్క హూజూరాబాద్ లోనే ఎందుకు అమ‌లు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. హూజూరాబాద్ లో డ‌బ్బులు పంచ‌టానికే హైద‌రాబాద్ లో భూములు అమ్మార‌న్నారు. ఎవ‌రెన్ని చేసినా ఎన్నిక‌ల్లో గెలిచేది తానేన‌ని ప్ర‌క‌టించారు. ఈటెల రాజేంద‌ర్ ది కారు గుర్తు అని కొంత మంది త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Next Story
Share it