బిజెపిలో చేరిన ఈటెల
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు ఢిల్లీలో బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చి..కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ తోపాటు బండి సంజయ్, డీ కె అరుణ తదితర నేతలు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ తోపాటు మాజీ ఎంపీ రమేష్ రాధోడో, తుల ఉమ, అశ్వత్థామరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితర నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన అనంతరం ఈటెల మాట్లాడుతూ త్వరలోనే అన్ని జిల్లాల నుంచి బిజెపిలోకి చేరికలు ఉంటాయని తెలిపారు.