Telugu Gateway
Politics

తెలంగాణ‌లో ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌యోగాలు చెల్ల‌వ్

తెలంగాణ‌లో ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌యోగాలు చెల్ల‌వ్
X

తెలంగాణ‌లో త‌న ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేక మ‌ధ్య‌లోనే తుంచేసే ప్ర‌య‌త్నం చేశార‌ని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం కెసీఆర్ కుటుంబ స‌భ్యులే ముఖ్య‌మంత్రి అవుతార‌ని..అదే బిజెపిలో అయితే సామాన్యుల‌కు కూడా ఛాన్స్ వ‌స్తుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌యోగాలు ఏమీ ప‌నిచేయ‌వ‌ని వ్యాఖ్యానించారు. భ‌విష్య‌త్ లో హ‌రీష్ రావు కూడా త‌న లాంటి ప‌రిస్థితే ఎదురుకావొచ్చ‌న్నారు. సిద్ధిపేట‌లో జ‌రిగిన బిజెపి ఓబీసీ మోర్చా స‌మావేశంతోపాటు త‌ర్వాత ఆయ‌న మీడియాతో కూడా మాట్లాడారు.

హుజూరాబాద్ లో 600 కోట్లు ఖ‌ర్చు చేసినా గెల‌వ‌లేక‌పోయార‌ని..రాష్ట్రంలో వేల కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూములు అమ్మి పాల‌న సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎన్నికలప్పుడే సీఎం కెసీఆర్ కు ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయని విమర్శించారు. కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. దళితబంధు ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మోసపూరిత మాటలు ఇక చెల్లవ‌ని, ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు.

Next Story
Share it