ప్రగతి భవన్ ముందే చావు డప్పు కొట్టాలి
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నిర్వహించిన చావు డప్పు, ప్రధాని మోడీ దిష్టిబొమ్మల దహనంపై ఆయన మండిపడ్డారు. సోమవారం నాడు కొల్లాపూర్ లో పర్యటించిన ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలు దగ్థం చేయటం.. చావు డప్పులు కొట్టడం దుర్మార్గమన్నారు. చాపు డప్పు కొట్టాల్సి వస్తే మెదట ప్రగతి భవన్ ముందు కొట్టి.. కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయాలన్నారు. శాంతి భద్రతలు.. ఆస్తులు.. ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన ముఖ్యమంత్రే బీజేపీ నేతల మీద దాడులు చేయమనడం దారుణమని చెప్పారు.
దళితుడుని ముఖ్యమంత్రి చేయకుంటే తల నరుకుంటానని ద్రోహం చేసినందుకు ప్రగతి భవన్ ముందు చావు డప్పు కొట్టాలన్నారు. మూడు ఎకరాలు భూమి.. నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు కేసీఆర్ దిష్టిబొమ్మ తగులబెట్టాలన్నారు. 57ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మాట తప్పినందుకు కేసీఆర్‌కి చావు డప్పు కొట్టాలని చెప్పారు. హుజురాబాద్ దెబ్బకు ఫాంహౌస్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్.. మారువేషంలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. టీచర్ల బదిలీల్లో అన్యాయం జరుగుతుంటే ఎందుకు పరిష్కరించరు?అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.