దుబ్బాక ఓటమికి బాధ్యత నాదే
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తానన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు అన్నారు. 'దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటాం.. మా లోపాలను సవరించుకుంటాం.
దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతాం అందుబాటులో ఉంటాం. ఓటమి అయినప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన టిఆర్ ఎస్ పార్టీ పక్షాన, నా పక్షాన కష్ట సుఖాల్లో ఉంటాం.సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కి , ప్రజలకు , కార్యకర్తలకు , అన్నివిధాల సహాయ సహకారాలు ఇస్తూ , టి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తోంది' అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక వ్యవహరంలో హరీష్ రావే బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.