Telugu Gateway
Politics

అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు

అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు
X

బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులామా? టీఆర్ ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

అయోధ్య రామమందిరానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో కట్టే రామాలయానికి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి. మన దగ్గర రామాలయాలు లేవా అని ప్రశ్నించారు. మన దగ్గర రామాలయాలకే మనం నిధులు ఇవ్వాలన్నారు. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటాకనికి తెర లేపుతున్నారని విమర్శలు గుప్పించారు.

తమకు కూడా భక్తి ఉందని.. తాము కూడా శ్రీరాముని భక్తులమే అని విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాలను సీఎం కేసీఆర్ సమానంగా చూస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే తెలంగాణలో అభివృద్ధి వేగం పుంజుకుందని వ్యాఖ్యానించారు. బొట్టు పెట్టుకుంటేనే రామభక్తులమా అని ప్రశ్నించారు. విద్యాసాగర్ రావు వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. పలు చోట్ల బిజెపి ఆందోళనకు దిగింది.

Next Story
Share it