Telugu Gateway
Politics

స్టాలిన్ సీఎం కావాలని చేతివేళ్లు నరికేసుకున్నాడు

స్టాలిన్ సీఎం కావాలని చేతివేళ్లు నరికేసుకున్నాడు
X

తమిళనాడు రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. అక్కడ అభిమానం కూడా పీక్ లో ఉంటుంది. అది ఎంతలా అంటే ఏకంగా డీఎంకె అధినేత స్టాలిన్ సీఎం కావాలని కోరుకుంటూ ఓ కార్యకర్త తన చేతివేళ్లను నరికేసుకున్నాడు. అంతే కాదు.. ఆ వేళ్లను అమ్మవారికి కానుకగా అందజేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. చాలా చోట్ల ఇలా పార్టీ అభిమానులు తమ అభిమాన నేత సీఎం కావాలని నాలుక కోసుకున్న ఘటనలు గతంలో కూడా జరిగాయి.

ఇప్పుడు తమిళనాడులో ఓ అభిమాని తన చేతి వేళ్లను నరికేసుకోవటం చాలా మందిని షాక్ కు గురిచేసింది. ఈ సారి తమిళనాడు ఎన్నికల్లో డీఎంకెదే విజయం అని పలు సర్వేలు తేల్చాయి. డీఎంకె అధినేత స్టాలిన్ నిర్వహించిన రోడ్ షోలకు..సభలకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బిజెపితో అధికార ఏఐడీఎంకె పొత్తు మైన స్ గా మారుతుందనే ప్రచారం కూడా ఉంది.

Next Story
Share it