Telugu Gateway
Politics

కుట్రలు పన్ని గోడలపై రంగులు తుడిచేశారు కానీ..!

కుట్రలు పన్ని గోడలపై రంగులు తుడిచేశారు కానీ..!
X

అభివృద్ధి అంటే నాలుగు భవనాలు కాదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన సభలో పలు అంశాలపై మాట్లాడారు. కుట్రలు పన్ని గోడలపై ఉన్న రంగులు తుడిచివేయగలిగారు గానీ.. ప్రజల గుండెల్లో రంగులను తాకలేకపోయారన్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌, తిరుపతి ఉపఎన్నిక సహా ఏ ఎన్నిక వచ్చినా దేవుడి దయతో ఒకే జెండా ఎగిరిందని తెలిపారు. 'గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించాం. మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించాంమొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశాం. మనం ప్రజలకు సేవకులమని గుర్తుపెట్టుకుని పనిచేయాలి'' అని తెలిపారు.

చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని.. కుల, మత, ప్రాంత, రాజకీయాలు చూడకుండా సంక్షేమం అందించామని పేర్కొన్నారు. '' నాలుగు బిల్డింగ్‌లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. నిన్నటికంటే ఈరోజు బాగుండాలి. రేపు మరింత బాగుంటుందనే భరోసా కల్పించాలి. నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 62 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారి బతుకులు మార్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది. గతంలో మ్యానిఫెస్టో అంటే ఎన్నికల ప్రచారానికి మాత్రమే. కానీ మేం రెండేళ్ల కాలంలోనే 94.5 శాతం హామీలు నెరవేర్చాం. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు..రైతులకు తోడుగా ఉంటున్నామని ప్రకటించారు.

Next Story
Share it