Telugu Gateway
Politics

ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కే మొగ్గు !

ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కే మొగ్గు !
X

ఒక్కో ఎగ్జిట్ పోల్ ది ఒక్కో లెక్క. అయితే ఎక్కువ మంది మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉన్నట్లు చెపుతున్నారు. హోరా హోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ముగిశాయి. ఫలితాలు ఫిబ్రవరి 8 న వెల్లడవుతాయి. ఎన్నిక ముగిసిన వెంటనే ఎప్పటిలాగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. గత కొంత కాలంగా ఎగ్జిట్ పోల్స్ గందగోళంగా మారుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ తాము ఈ ఎగ్జిట్ పోల్స్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటిస్తే...మరో వైపు అధికారంలోకి వస్తుంది అని ప్రచారం లో ఉన్న బీజేపీ కూడా ఈ లెక్కలు తప్పు అని...తమకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని చెపుతోంది. అధికారికంగా ఫలితాలు వచ్చే వరకు ఇలా ఎవరి లెక్కల్లో వాళ్ళు మునిగితేలటమే. ఇటీవలే వరసగా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ధీమాతో ఉన్న బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో కూడా పాగా వేసే అవకాశం ఉంది అనే అంచనాలు వెలుతుడుతున్నాయి.

అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనేది ఫిబ్రవరి ఎనిమిదిన కానీ తేలదు. ఇప్పటికైతే మెజారిటీ సంస్థలు బీజేపీ అనుకూలంగా ఉన్నట్లు తేల్చాయి. మొన్నటి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పక్కాగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన కె కె సర్వే మాత్రం ఢిల్లీ లో మళ్ళీ ఆప్ కే అధికారం అని చెపుతుంది. ఆప్ మరో సారి 44 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అని తేల్చిచెపుతోంది. ఏ ప్రాంతం లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న విషయంలో కూడా కచ్చితం అయిన లెక్కలు ఇచ్చారు. ఈ సారి కూడా కె కె ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే ఇది పెద్ద సంచలనంగా మారుతుంది అనటంలో సందేహం లేదు.

వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

పీపుల్ పల్స్: బీజేపీకి 51-60, ఆప్‌ 10-19, కాంగ్రెస్ - జీరో

మ్యాట్రిజ్ : బీజేపీకి 35-40, ఆప్ 32-37, కాంగ్రెస్ 0-1

జేవీసీ : బీజేపీ 39-45, ఆప్ 22-23, కాంగ్రెస్ 0-2

పీ-మార్క్: బీజేపీ 39-49, ఆప్ 21-31, కాంగ్రెస్ 0-1

పీపుల్స్ ఇన్సైట్ : బీజేపీ 40-44, ఆప్ 25-29, కాంగ్రెస్ 0-1

ఛాణక్య స్ట్రాటజీస్ : బీజేపీ 39-44, ఆప్ 25-28, కాంగ్రెస్ 2-3

పోల్ డైరీ : బీజేపీ 42-50, ఆప్ 19-25, కాంగ్రెస్ 0-2

Next Story
Share it