ఇది చాలా పెద్ద కేసు..సీబీఐకి ఇవ్వండి
తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ హత్య కుట్రకు సంబంధించి రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఈ అంశంపై పలు సందేహాలు లేవనెత్తారు. ఇది చాలా పెద్ద కేసు..పెద్ద పెద్ద వాళ్లు భాగస్వాములు అయినందున దీన్ని సీబీఐకి ఇవ్వాలని కోరారు. దాసోజు శ్రవణ్ లేవనెత్తి న సందేహాలు ఇలా ఉన్నాయి..
1. సాక్షాత్తు మంత్రినే హత్య చేయడానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకుల పాత్ర ఉందేమో అన్న రీతిలో పోలీసుల వ్యాఖ్యానం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి?
2. రూ 12 కోట్లు ఎవరు, ఎక్కడ ఇచ్చిండ్రు?
3. సుపారీ హంతకుల వద్ద దొరికిన తుపాకులెవరివి?
4. అసలు మంత్రి హత్యా చేయాలనుకోవడానికి కారణాలు ఏంటి?
5. ఈ వ్యవహారం మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది.
6. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ జాతీయ నాయకులతోసహా, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర లను బహిరంగంగా లై డిటెక్టర్ టెస్ట్లు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలి.
7. సాక్షాత్తు మంత్రినే చంపడానికి కుట్ర జరిగింది కాబట్టి, పెద్ద వాళ్ళ పాత్రపై సిబిఐ విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేశారు.