Telugu Gateway
Politics

పురంధేశ్వరి ఎంట్రీ వెనక అసలు కథ ఏంటి?!

పురంధేశ్వరి ఎంట్రీ వెనక అసలు కథ ఏంటి?!
X

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ లో ఇది ఎవరూ ఊహించని పరిణామంగానే చెప్పాలి. పెద్దగా ప్రచారంలో లేకుండా అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులు అయ్యారు. ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు వదిన అవుతుంది అనే విషయం విషయం తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ గా ఎవరు వచ్చినా ఇప్పటికిప్పుడు చేసేది ఏమీ లేదు అనే చెప్పొచ్చు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన తో బీజేపీ కూడా కలిసి సాగుతుంది అనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఒక బహిరంగ సభలో బీజేపీ మద్దదు మనకు ఉండకపోవచ్చు అని చెప్పటం, అంతకు ముందు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డలు జగన్ డి అవినీతి సర్కారు అని గతానికి బిన్నంగా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పెట్టుకోబోయే పొత్తు సాఫీగా సాగేందుకు వీలుగా పురేందేశ్వరిని నియమించారా లేక ఎన్టీఆర్ కుమార్తె గా ఆమె నాయకత్వంలో పార్టీని బరిలోకి దింపి తెలుగు దేశం పార్టీ ఓటు బ్యాంకు కు ఎంతో కొంత నష్టం చేయాలనే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉందా అన్న విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి సీట్లు తగ్గే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే పలు ప్రాంతీయ పార్టీల విషయం లో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం అంటే అంతా ఈజీ కాదు అని తెలుసు కాబట్టే ఇక్కడ ఎవరు గెలిచినా కూడా లోక్ సభ సీట్లు తమ నుంచి చేజారిపోకుండా బీజేపీ ఎత్తులు వేస్తుంది అనే ప్రచారం కూడా బలంగా ఉంది. అయితే అటు ప్రధాని మోడీ, ఇటు హోమ్ మంత్రి అమిత్ షా లు ఏమి చేసినా కూడా పక్కా లెక్కల ప్రకారమే చేస్తారు అనే విషయం తెలిసిందే. మరి ఈ లెక్కల చిక్కుముడులు వీడాలంటే కొద్ది కాలం ఆగితే కానీ తేలదు. మరో వైపు సోము వీర్రాజు అధికార వైసీపీ తో కలిసి ముందుకు సాగారు అనే ప్రచారం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ఇప్పుడు ఆయన్ను తొలగించటంతో బీజేపీ వైఖరి మారుతుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో స్టార్ట్ అయింది. . అయితే బీజేపీ విషయంలో ఇప్పటికిప్పుడు ఏ అంచనాకు వచ్చినా అది తొందరపాటు అవుతుంది అని చెపుతున్నారు.

Next Story
Share it