మోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
BY Admin20 Jun 2022 5:40 PM IST
X
Admin20 Jun 2022 5:40 PM IST
బిజెపి ఆదేశాలను పాటించే వారికి ఆరోపణల విముక్తి పథకం అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఇప్పుడు 5422 ఈడీ కేసులు ఉంటే..అందులో మోడీ సర్కారు వచ్చిన తర్వాత పెట్టినవే 5310 అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ఆరోపించారు. సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడే వారి నోరు మూయించేందుకు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు ఈడీ కేసుల లెక్కలు చూస్తేనే ప్రతిపక్ష పార్టీలను ఎంతగా టార్గెట్ చేశారో తెలుస్తుందని అన్నారు. అగ్నిపథ్ స్కీమ్ ను వెనక్కి తీసుకోవాల్సిందేనని..పార్లమెంట్ లో ఈ అంశాన్ని తాము లేవనెత్తుతామని మాకెన్ వెల్లడించారు.
Next Story