Telugu Gateway
Politics

బండికి దండ వేసి నిర‌స‌న తెలిపిన రాహుల్

బండికి దండ వేసి నిర‌స‌న తెలిపిన  రాహుల్
X

ప‌ది రోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు అయిపోయాయి బాదుడు షురూ అయింది. పెట్రోలియం సంస్థ‌ల బాదుడుతో దేశ‌వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొత్త కొత్త రికార్డులు న‌మోదు చేస్తున్నాయి. పెట్రో ద‌ర‌ల పెంపు తీరుపై కాంగ్రెస్ తోపాటు దేశంలోని ప్ర‌ధాన పార్టీలు అన్నీ మండిప‌డుతున్నాయి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు.గత 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను 9 సార్లు పెంచారని, పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ సింఘ్వీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని తాము ముందే చెప్పామని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు.ఇంధనం, ఎల్‌పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా గురువారం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్‌ ఖర్గే చెప్పారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఓ ద్విచ‌క్ర వాహ‌నానికి, గ్యాస్ బండ‌కు దండ‌లు వేసి నిర‌స‌న‌లు తెలిపారు.

Next Story
Share it