మోడీకి కాంగ్రెస్ థ్యాంక్స్
మాట్లాడితే ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం థ్యాంక్స్ చెప్పింది. దీనికి కారణం ఏమిటంటే కరోనా రెండవ దశ అనూహ్యంగా విస్తరిస్తున్న దశలో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయటాన్ని స్వాగతించింది. అయితే బోర్డు 12వ తరగతి పరీక్షల విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సూచించింది. అప్పటివరకూ విద్యార్ధులను టెన్షన్ పెట్టడం ఏ మాత్రం సరికాదని అభిప్రాయపడింది. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పరీక్షల విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం దేశం కోసం..విద్యార్ధుల కోసం కాబట్టి దీనికి పూర్దిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
12వ తరగతి పరీక్షలపై జూన్ లో నిర్ణయం తీసుకుంటామని అనటం వల్ల..విద్యార్ధులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ..ఇది లక్షలాది మంది విద్యార్ధులు, వారి తల్లితండ్రులకు పెద్ద ఊరట అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఎస్ఈ పరీక్షల విషయంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.