Telugu Gateway
Politics

కెసిఆర్ ప్లాన్ ను పసిగట్టిన కాంగ్రెస్!

కెసిఆర్ ప్లాన్ ను పసిగట్టిన కాంగ్రెస్!
X

బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం పై కీలక పార్టీ లకు క్లారిటీ వస్తున్నట్లు ఉంది. ప్లీనరీ వేదికగా కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఇదే అంశంపై స్పందించింది. తృతీయ శక్తీ అంటే అది అంతిమంగా బీజేపీ కి మేలు చేయటానికే అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. అయన ప్రధానంగా బిఆర్ఎస్, ఆప్ లను టార్గెట్ చేసుకునే ఈ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కారును ఓడించాలి అంటే ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటి అవ్వాలని ఒక వైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత కొన్ని రోజులుగా పిలుపునిస్తున్నారు. అందరూ ఏకం అయితే బీజేపీ ని వంద సీట్లకు పరిమితం చేయవచ్చు అని అయన పదే పదే చెపుతున్నారు. యూపీఏ తరహాలో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగటానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవసరం అయితే దీనికోసం త్యాగాలు చేయటానికి కూడా రెడీ అని మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ కలిసి నడవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేదని చెప్పొచ్చు. అయినా కూడా తెలంగాణ సీఎం కెసిఆర్ రాజకీయ కదలికలపై కాంగ్రెస్ పార్టీ కి చాలా అనుమానాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

ప్రస్తుతం బిఆర్ఎస్ తో కేవలం లిక్కర్ స్కాం ఫ్రెండ్స్ అయిన అప్ మాత్రమే ఉంది అని ఒక కీలక కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఎంఐఎం మిత్ర పక్షమే అయినా తెలంగాణ లో నేరు గా ఆ పార్టీ తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉండదు అని భావిస్తున్నారు. కెసిఆర్ ప్లాన్స్ గ్రహించే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా మూడవ ప్రత్యామ్నాయం బీజేపీ మేలు కోసం అని ప్రకటన చేసింది అని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన మూడ్ అఫ్ ది నేషన్ సర్వే లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుందనే సంకేతాలు ఇచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక తేవటం లో విజయవంతం అయింది అనే అభిప్రాయం తో ఆ పార్టీ నేతలు ఉన్నారు. త్వరలోనే రాహుల్ తో పాటు కీలక నేతలు అందరూ నిత్యం ప్రజల్లో ఉండేలా మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it