Telugu Gateway
Politics

కెసీఆర్ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు

కెసీఆర్ పాలన చూసి తెలంగాణ తల్లి  కన్నీరు
X

అసలు నీకు మానవత్వం ఉందా?

తండ్రీ, కొడుకులు డ్రామాలు ఆపాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తండ్రీ, కొడుకులు డ్రామాలు ఆపాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో ఎప్పుడు చేర్చుతారని కేటీఆర్ ను ప్రజలు ట్విట్టర్ వేదిక గా నిలదీస్తున్నారు. మీ కొడుకు కేటీఆర్ నీ దృష్టికి తీసుకవస్తాను అని చెప్పారు. మీ దృష్టి కి ...మీ కొడుకు కేటీఆర్ తీసుకవచ్చారా లేదా కేసీఆర్. ఎప్పుడు ఆరోగ్య శ్రీ లో చేర్చుతారు. ఎందుకు కరోనా చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు కేసీఆర్. కరోనా తో ప్రజలు పిట్టల రాలుతుంటే ని కంటికి కన్పించడం లేదా?. కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు ని కొడుకు కేటీఆర్ కు అప్పగించావు. కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజల కోసం ఆలోచించండి. కరోనా నుండి ప్రజలను కాపాడండి. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చకపోతే అయ్యా కొడుకులను చరిత్ర క్షేమించాదు.

కరోనా తో అల్లాడుతున్న వారికి ఉచిత వైద్యం అందించకపోతే అధికారంలో ఉండి ఏమి ఉద్ధరిస్తావు కేసీఆర్. ప్రజలను కాపాడలేకపోతే ఎందుకు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి. కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చకపోతే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడనికి నీకు అర్హుతా లేదు కేసీఆర్. నువ్వు పాలన సాగించేది ప్రజల కోసమా...నీ కుటుంబం కోసమా. కేసీఆర్... నీ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. కేసీఆర్ కు ప్రజల ఉసురు తగులుతుంది. సీఎం కేసీఆర్ కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేరుస్తానని చెప్పాడు కదా... మరి టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు ఏమి చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంది మీకు కన్పించడం లేదా'? అని ప్రశ్నించారు. ఇంకా ఎంత కాలం ప్రజల కోసం ప్రశ్నించకుండా కెసీఆర్ భజన చేస్తారని కోమటిరెడ్డి మంత్రులు..ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

Next Story
Share it