Telugu Gateway
Politics

రాహుల్ పై విమ‌ర్శ‌లు...కాంగ్రెస్ ఎదురుదాడి

రాహుల్ పై విమ‌ర్శ‌లు...కాంగ్రెస్ ఎదురుదాడి
X

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నేపాల్ ప‌ర్య‌ట‌న‌పై బిజెపి రాజ‌కీయం చేస్తుంటంతో ఆ పార్టీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ నేత‌లు బిజెపి నాయ‌కుల‌కు సంబంధించిన ఫాత ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వీటి సంగ‌తి ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా గ‌ట్టి కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముందని?, ఫ్రెండ్‌ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా? అని బీజేపీని ప్రశ్నించారు. నేపాల్ భారత్‌కు మిత్ర దేశం. ఆహ్వానం మేరకే రాహుల్ గాంధీ వివాహ వేడుకకు వెళ్లారు. అంతేకానీ ప్రధాని మోదీలా మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట వేడుకకు వెళ్లలేదు.

షరీఫ్‌తో కలిసి కేక్‌ కట్టింగ్‌ చేయలేదు. ఆయన పర్యటన తర్వాతే పఠాన్‌కోట్‌లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. రాహుల్‌ చేసిందాంట్లో తప్పేమీ లేదు. అలా పెళ్లికి వెళ్లడం సంప్రదాయం కూడా. నేరం కాదు. బహుశా బీజేపీ త్వరలో ఇలా బంధువులు, స్నేహితుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని ఒక నేరంగా ప్రకటిస్తుందేమో అంటూ సెటైర్లు వేశారు రణ దీప్ సూర్జేవాలా. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాకూర్‌.. ఇది ఎవరో చెప్పాలంటూ ప్ర‌శ్నించారు.

Next Story
Share it