Telugu Gateway
Politics

బిజెపి జెండా ప‌ట్ట‌కుని నా బ‌స్ కు అడ్డం వ‌స్తారా?

బిజెపి జెండా ప‌ట్ట‌కుని నా బ‌స్ కు అడ్డం వ‌స్తారా?
X

తెలంగాణ సీఎం కెసీఆర్ మ‌రోసారి బిజెపిపై..ప్ర‌ధాని మోడీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బిజెపి జెండా ప‌ట్ట‌కుని నా బ‌స్ కు అడ్డం వ‌స్తారా? అంటూ ధ్వ‌జ‌మెత్తారు. కెసీఆర్ మంగ‌ళ‌వారం నాడు వికారాబాద్ జిల్లాలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ ప్ర‌ధానిపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 'ప్ర‌ధాన మంత్రే మ‌న‌కు శ‌త్రువు అ య్యాడు. బిజెపి ప్రధాని మోడీ లాంటి దుర్మార్గులను దేశం నుంచి తరిమి కొట్టాలి. నిన్న మోడీ స్పీచ్ లో ఏమీలేదు. ప్ర‌ధాని నిన్న గంట మాట్లాడాడు అంతా గ్యాసే. మ‌న సంక్షమ కార్య‌క్ర‌మాలు ఉచితాలు అంటున్నారు. నెత్తికి రుమాల్ క‌ట్టే వేషం త‌ప్ప‌..ఏమి ఉంది. డైలాగులు త‌ప్ప మంచి మాట ఏమైనా ఉందా?. ఎనిమిదేళ్ల పాల‌న‌లో మోడీ చేసిందేమిటి?. సంస్క‌ర‌ణ‌ల పేరుతో మ‌న‌కు శ‌ఠగోపం పెట్టి..షావుకార్ల‌ను బాగుచేస్తున్నారు.' అంటూ మండిప‌డ్డారు. ఎంతో బాగున్న తెలంగాణ‌ను గుంట న‌క్క‌ల నుంచి కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

లేక‌పోతే మ‌రోసారి మోస‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు కర్ణాటకకు మించి భూముల ధరల పెరిగాయన్నారు. కర్ణాటక కన్నా వికారాబాద్‌లో భూముల ధరలు ఎక్కువని, ఇక్కడ ఒక ఎకరం అమ్మితే అక్కడ మూడు ఎకరాలు కొనొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్‌ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. వికారాబాద్‌కు మెడికల్‌, డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.'ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణలో ఉన్నాయి. రైతు బీమాతో రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నాం. రైతాంగాన్ని కాపాడుకోవాలి, పల్లె సీమలు కళకళలాడాలనేదే మా ఉద్ధేశం. నీటి బకాయిలు కూడా మాఫీ చేశాం. తెలంగాణ పల్లెలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కేంద్రం ప్రచారం చేస్తోంది. ఉచిత పథకాలు రద్దుచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెబుతోంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it