Telugu Gateway
Politics

ఆ ప్రత్యేక నిధుల మతలబు ఏమిటో

ఆ ప్రత్యేక నిధుల మతలబు ఏమిటో
X

ప్రత్యేక అభివృద్ధి నిది (ఎస్డీఎఫ్) కొత్తగా వచ్చింది ఏమి కాదు. ఎప్పటినుంచో ఉన్నదే. కాకపోతే ఈ కేటాయింపులు మాత్రం అసాధారణం..అనూహ్యం అని చెప్పక తప్పదు. ఎందుకు అంటే సోమవారం నాడు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పలు శాఖల కంటే కూడా ఎస్డీఎఫ్ నిధులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నిధులను ముఖ్యమంత్రి కెసిఆర్ తన విచక్షణ కింద ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వొచ్చు అన్న మాట. ఇది ఎన్నికల ఏడాది. సీఎం కెసిఆర్ తన పర్యటనల సందర్భంగా హామీలు ఇచ్చి రాజకీయంగా లబ్ది పొందటానికి ఈ ఖాతా కింద ఇంత భారీ మొత్తంలో కేటాయింపులు చేశారని అధికారులు చెపుతున్నారు. ఇది అసాధారణం అని ఐఏఎస్ లు కూడా అభిప్రాయపడుతున్నారు.

గత బడ్జెట్ లో ఈ ఖాతా కింద 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ...ఈ సారి ఆ మొత్తం ఏకంగా 10348 కోట్లకు పెంచటం చూసి అందరూ అవాక్కు అవుతున్నారు. ఇంచు మించు ఈ బడ్జెట్ కేటాయింపులు ఏకంగా మున్సిపల్ శాఖ బడ్జెట్ కు దగ్గరగా ఉండటం విశేషం. సీఎం విచక్షణ కింద ఉండే నిధులను ఇంత భారీ మొత్తంలో పెంచటం ఏ మాత్రం సరికాదు అని....వాస్తవానికి సీఎం అక్కడ అంటే అక్కడ ఆ శాఖ ద్వారా పనులు చేయించుకునే అవకాశం ఉన్నా ..ఇలా ఎస్డీఎఫ్ కింద నిధులు పెట్టుకోవటం కంటే టార్గెట్ ఎలేచ్షన్స్ అన్నది స్పష్టం అవుతుంది అని చెపుతున్నారు. వీటితో పాటు నియోజకవర్గాల అభివృద్ధికి మరో 800 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఐ అండ్ పీఆర్ బడ్జెట్ కూడా ఏకంగా వెయ్యి కోట్లకు పెంచారు. ఇది కూడా ఎలక్షన్ ఎఫెక్ట్ అంటున్నారు.

Next Story
Share it