బిజెపి వ్యతిరేకతపై కెసీఆర్ అప్పుడే రివర్స్ గేర్ ?!
తమది బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ కాదంటూ వ్యాఖ్యలు
దేశం మేలు కోసమే మా ప్రయత్నం అంతా అని ప్రకటన
కొద్ది రోజుల నుంచి బిజెపి, ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్న సీఎం కెసీఆర్ అప్పుడే రివర్స్ గేర్ వేసినట్లు కన్పిస్తోంది. శుక్రవారం నాడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేసే ప్రయత్నాలు ఏదో బిజెపి వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక..ఆ ఫ్రంట్..ఈ ఫ్రంట్ కాదన్నారు. బిజెపిని బంగళాఖాతంలో కలిపితేనే దేశానికి మేలు జరుగుతుందని..మోడీని, బిజెపిని దేశం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉందని నిన్న మొన్నటి వరకూ మాట్లాడిన కెసీఆర్ అకస్మాత్తుగా బిజెపికి వ్యతిరేక ప్రంట్ కాదని అనటంతోనే సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. అసలు దేశంలో మోడీకి కెసీఆరే ప్రత్యామ్నాయం అన్నంతగా హడావుడి చేసి ఇప్పుడు ఈ రివర్స్ గేర్ ఏమిటి అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దేశంలో అత్యంత శక్తివంతంగా ఉన్నది బిజెపి మాత్రమే. మరి బిజెపికి వ్యతిరేకంగా కాకుండా కెసీఆర్ ఎవరితో పోరాడుతారు అన్నది ఆసక్తికర పరిణామం. అంతే కాదు..థర్డ్ ఫ్రంట్..ఫోర్త్ ఫ్రంట్ అంటూ ఏదోదో రాస్తున్నారు. ఇంకా ఏమీలేదు. అలాంటిది ఏమైనా ఉంటే తామే చెబుతామన్నారు. అసలు ఏమి జరుగుతుందో భవిష్యత్ లో తేలుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఏ ఫ్రంట్ ఏర్పాటు కాలేదన తేల్చిచెప్పారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు.
భారతదేశాన్ని సరైన దిశలో తీసుకెళ్ళటమే తమ లక్ష్యం అన్నారు. అందరితో కలసి చర్చించిన తర్వాత ఏమి ఏర్పాటు చేయాలో..ఇంకా ఏమేమి చేయాలో ఆలోచిస్తామన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఏజెండా కావాల్సిన అవసరం ఉందన్నారు. 'బీజేపీ ముక్త్ భారత్' అంటూ నినదించిన సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా ఆ పార్టీ వ్యతిరేకత వదిలేసుకోవటం వెనక అసలు కారణాలు ఏమి అయి ఉంటాయన్నది కీలకంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలో మకాం వేశారు. అక్కడ నుంచే జార్ఖండ్ వెళ్ళి సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇప్పటికే కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ నేత శరత్ పవార్‌ను కలిశారు. గురువారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్‌ను కూడా కలిశారు. సీఎం కెసీఆర్ మహారాష్ట్ర పర్యటన అనంతరం శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కాంగ్రెస్ లేని ఫ్రంట్ కోసం తాము ఎలాంంటి ప్రయత్నాలు చేయబోమని..మమతాతోపాటు కెసీఆర్ తో సహా కాంగ్రెస్ తో కలసే తాము ముందుకు సాగుతామని చెప్పినట్లు స్పష్టం చేశారు.
'కలకలం' క్ష