Telugu Gateway
Politics

కెసీఆరే శాంతి భ‌ధ్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించారు

కెసీఆరే శాంతి భ‌ధ్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించారు
X

బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కెసీఆరే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్‌పై టీఆర్ఎస్ గుండాలు, పోలీసులు కల‌సి చేసిన దాడి అని బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు పాలించడానికి ఎన్నుకున్నారా? లేక గూండాయిజం చేయడానికి ఎన్నుకున్నారా...? అని ప్రశ్నించారు.

యువమోర్చా కార్యకర్తపై కత్తులతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, హోం గార్డును బదిలీ చేసే అధికారం కూడా డీజీపీకీ లేదా? అని ప్రశ్నించారు. సీపీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని అన్నారు. మంగ‌ళ‌వారం నాడు బిజెపి ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ వాహ‌నంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. అయితే అది రైతుల ప‌ని అని..త‌మ‌కు సంబంధం లేద‌ని టీఆర్ఎస్ చెబుతోంది.

Next Story
Share it