అదికారం అంటే అహంకారం కాదు
వైసీపీ ప్లీనరీ వేదికగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అదికారం అంటే అహంకారం కాదు..ప్రజలపై మమకారం అని నిరూపించామని వ్యాఖ్యానించారు. తన రాజకీయ పోరాటంలో ఎన్నో రాళ్ళు పడ్డా..వ్యవస్థలు కత్తికట్టినా తన గుండె బెదరలేదు..సంకల్పం చెక్కుచెదరలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైసీపీ అని గర్వంగా చెప్తున్నాం. ఈ మూడేళ్ల ప్రయాణం ఎన్నో పోరాటాల ప్రస్థానం. రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని నిరూపించింది మన పాలన. మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. నాన్న నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడు నా చేయి వీడలేదు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి ఎల్లో మీడియా గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దోచుకో పంచుకో అన్నట్లుగా వ్యవహరించిన గజదొంగల ముఠా దుష్టచతుష్టయం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల్ని, వాటికి అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించింది.ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక లేదు. మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్ అన్నారు. నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. ఈ 13ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైసీపీఈ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.