Top
Telugu Gateway

ఢిల్లీ ముందు మెడలు వంచిన జగన్

ఢిల్లీ ముందు మెడలు వంచిన జగన్
X

రాష్ట్రంలో మెజారిటీ ఎంపీలు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైంది?. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఏమి చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రం మెడలు వంచుతానని ప్రకటించిన జగన్ ఇప్పుడు తానే కేంద్రం దగ్గర మెడలు వంచాడని ఎద్దేవా చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పాత గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్లకు ఓట్లు వేస్తే రౌడీయిజానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని అన్నారు. రౌడీలు, గూండాలు, నేరస్తులు పెట్రేగిపోతారని, దాడులకు తెగబడతారని.. అలాంటప్పుడు మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరని చంద్రబాబు అన్నారు.

వైసీపీ అభ్యర్ధులందరూ నేర చరిత్ర కలిగి ఉన్నారని, నేర చరిత్ర లేకపోతే జగన్ వారికి టిక్కెట్లు ఇవ్వరని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఓట్లు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు అంగీకరించినట్లు అవుతుందన్నారు. అలాగే విశాఖపట్టణానికి పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. రెండు రోజులుగా చంద్రబాబు విశాఖపట్నలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను తీసుకురావటంతో జగన్ ఘోరంగా విఫలమవుతున్నారని విమర్శించారు. గతంలో అప్పులపై విమర్శలు చేసి..ఇప్పుడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు.

Next Story
Share it