మోడీ మారారా..బాబు చూసే కోణం మారిందా!

ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రాపకం కోసమే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనే లెక్కలతో మోడీ పై అవసరానికి మించి మరీ వ్యక్తిగత విమర్శలు చేశారు అని..ఇప్పుడు చంద్రబాబు మోడీ పక్కన చేరినందున కాంగ్రెస్ కూటమి అవకాశాలు మెరుగుపడే ఛాన్స్ ఉంది అంటూ ఒక నేత అభిప్రాయపడ్డారు. ఇటు జగన్ మోహన్ రెడ్డి, అటు చంద్రబాబులు ఇద్దరూ కూడా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రధాని మోడీ తీరని అన్యాయం చేస్తున్నా కూడా ఎవరి మోడల్ లో వాళ్ళు ఆయనకు మద్దదు ఇస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఐఏఎస్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎక్కడివరకో ఎందుకు స్వయంగా ప్రధాని మోడీ శంఖుస్థాపన చేసిన రాజధాని, చంద్రబాబు కలల అమరావతి ప్రాజెక్ట్ ను సీఎం జగన్ నాలుగున్నర సంవత్సరాలుగా అట కెక్కించినా కూడా మోడీ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అయినా మోడీ దగ్గర చంద్రబాబు కు తప్పేమి కనిపించటం లేదు. కేంద్రం అండ లేకుండా సీఎం జగన్ ఇలా చేయగలరా?. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు అప్పులతో పాటు అన్నింటికీ కేంద్రం సహకరిస్తుంది అని రాష్ట్రంలో టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తారు..ఢిల్లీ కి పోయి మాత్రం చంద్రబాబు మోడీ భజన చేస్తున్నారు అంటే ఏదో లెక్క తేడా ఉంది అనే చర్చ సాగుతోంది.