తెలంగాణలోలేని అభ్యంతరాలు ..ఏపీలో ఎందుకు?
ఏపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారు? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్థాయన్నారు. భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలను నిర్వహించే తెలంగాణలో అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సోమవారం నాడు సమావేశమయ్యారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే 175 నియోజకవర్గాల్లో ఈనెల 10న చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం తీశారు. జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మద్య నిషేధంపై మహిళలతో కలిసి ఉద్యమించాలని తీర్మానించామని ప్రకటించారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా జగన్‌రెడ్డి ప్రజలను భ్రమింపజేశారని, దిశ చట్టం ఎక్కడ ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఇప్పటికే బిజెపి గణేష్ ఉత్సవాలకు ఆంక్షలు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం చెబుతోంది.