Telugu Gateway
Politics

కుప్పంలో ఓడింది టీడీపీ కాదు..ప్రజాస్వామ్యం

కుప్పంలో ఓడింది టీడీపీ కాదు..ప్రజాస్వామ్యం
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఓడింది టీడీపీ కాదని..ప్రజాస్వామ్యం ఓడిందని అన్నారు. బెదిరించి..డబ్బులు వెదజల్లి గెలిచారని.. ప్రశాంతమైన కుప్పంను కూడా పులివెందుల చేస్తారా? అని ప్రశ్నించారు. పులివెందుల పంచాయతీలు చెల్లవని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన చంద్రబాబు రాజీనామా చేయాలన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. తాను ఎందుకు రాజీనామా చేయలన్నారు. రాజీనామా చేస్తే అక్కడ కూడా అరాచకాలు చేయాలనా అంటూ ప్రశ్నించారు. కుప్పం ప్రజలు చాలా మంచివాళ్లని..శాంత స్వభావులు అని..అందరూ తనను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారని వ్యాఖ్యానించారు.

కుప్పంలో తన పిఏ మీద కూడా కేసులు పెట్టారన్నారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన ఏజెన్సీలో ఎక్కువ చోట్ల టీడీపీ గెలిచిందన్నారు. వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తనతో మైండ్ గేమ్ ఆడలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం, కోర్టు చెప్పినట్లు కౌంటింగ్‌ను ఎందుకు రికార్డ్ చెయ్యలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కౌంటింగ్ హాల్‌లో పోలీసులకు ఎం పని అని నిలదీశారు. డబుల్ డిజిట్ ఓట్ల మెజారిటీతో గెలిచిన చోటా రీకౌంటింగ్ ఎందుకు చేశారన్నారు. రాత్రి 10 గంటల తరువాత గెలుపు మార్చేశారని ఆరోపించారు. కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటే అధికారులు ఏమి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

Next Story
Share it