Telugu Gateway
Politics

కేంద్ర మంత్రి నారాయ‌ణ్ రాణే అరెస్ట్

కేంద్ర మంత్రి నారాయ‌ణ్  రాణే అరెస్ట్
X

మ‌హారాష్ట్ర‌లో క‌ల‌క‌లం. కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రేపై ఆయ‌న చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సంబంధించి మూడు ఎఫ్ ఐఆర్ లు న‌మోదు అయ్యాయి. దీంతో ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయ‌ణ్ రాణే మంగ‌ళ‌వారం నాడు కొంకణ్‌లో జన్‌ఆశీర్వాద్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అక్క‌డే రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది ముందే గ్రహించి రత్నగిరి కోర్టులో నారాయణ్‌ రాణే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా కో స‌త్వ‌ర విచార‌ణకు నో చెప్పింది . బెయిల్‌ పిటిషన్‌ రద్దయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. దీంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్పడ్డాయి.

బిజెపి, శివ‌సేన శ్రేణులు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగాయి. ఆగ‌స్టు 15న సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌సంగిస్తూ మ‌ధ్య‌లో త‌న సిబ్బందిని ఏదో స‌మాచారం అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు దేశానికి స్వాతంత్ర వ‌చ్చి ఎన్ని సంవ‌త్స‌రాలు అయిందో కూడా తెలియ‌ద‌ని..తాను అక్క‌డ ఉంటే చెంప చెళ్ళు మ‌న్పించే వాడిని అంటూ వ్యాఖ్యానించారు. అప్ప‌టి ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం సాగుతుంది. రాణేపై న‌మోదు అయిన కేసులు కొట్టాల‌ని కోరుతూ ముంబ‌య్ హైకోర్టును ఆయ‌న ఆశ్ర‌యించారు. అయితే మ‌హారాష్ట్ర పోలీసులు మాత్రం ఆయ‌న్ను అరెస్ట్ అనంత‌రం కోర్టులో హాజ‌రుప‌ర్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Next Story
Share it