Telugu Gateway
Politics

కెసీఆర్ కు నెలకు 15 రోజులు సెలవులే

కెసీఆర్ కు నెలకు 15 రోజులు సెలవులే
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటే సీఎం కెసీఆర్ మాత్రం నెలకు పది హేను రోజులు ఫాంహౌస్ లోనే ఉంటారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలన్నారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్, సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను సీఎం పరామర్శించకపోవటం బాధాకరం.

ఫాంహౌస్‌కు వెళ్లడానికి మాత్రం కేసీఆర్‌కు సమయం ఉంటుందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని..ఈ హామీని అమలు చేయటంలో విఫలమయ్యారని అన్నారు. మైనార్టీలు బీజేపీతోనే ఉన్నారు.. మైనార్టీలకు 100 శాతం బీజేపీ న్యాయం చేస్తుందని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. జూబ్లిహిల్స్ బిజెపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it