Telugu Gateway
Politics

మా మంత్రిని అరెస్ట్ చేయాల‌ని చూస్తున్నారు

మా మంత్రిని అరెస్ట్ చేయాల‌ని చూస్తున్నారు
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్, గోవాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. పంజాబ్ లో అయితే ఆప్ అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌నే అంచ‌నాలు కూడా వెలువ‌డుతున్నాయి. ప‌లు స‌ర్వేలు ఇదే విష‌యాన్ని వెల్ల‌డించాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో తిరిగి అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే కీల‌క నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న అంత‌ర్గ‌త విభేదాలు ఆ పార్టీకి స‌మ‌స్య‌గా మారాయి. తాజాగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తమ ప్రభుత్వంలోని ఒక మంత్రిని అరెస్ట్‌ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలవేళ కేంద్ర ఏజెన్సీలు చాలా చురుగ్గా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఎవరినైనా ఏజెన్సీలతో దాడులు చేయించగలరని, కానీ ఎవ‌రికీ తాము భయపడబోమని అన్నారు. కేంద్ర సంస్థ ఈడీ తమ ప్రభుత్వంలోని ఆరోగ్యశాఖమంత్రి స‌త్యేంద‌ర్‌ జైన్‌ను ఆర్థిక నేరాల పేరుతో అరెస్ట్‌ చేయాలని యోచిస్తునట్లు సమాచారం అందినట్లు తెలిపారు.జైన్‌ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో ఉన్నారన్నారు. 'పంజాబ్‌ ఎన్నికలకంటే ముందే రాష్ట్ర మంత్రి స‌త్యేంద‌ర్‌ జైన్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తోందని సమాచారం ఉంది. వారికి స్వాగతం పలుకుతాం. గతంలో కూడా ఆయనపై కేంద్ర ప్రభుత్వం దాడులు జరిపించింది. ఆయన వద్ద ఏం లభించలేదు' అని సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు.

Next Story
Share it